శర్వానంద్ మాకు మరో రామ్ చరణ్ లాంటివాడు: 'శ్రీకారం' ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి

08-03-2021 Mon 22:20
  • శర్వానంద్ హీరోగా శ్రీకారం
  • ఖమ్మంలో ప్రీరిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా చిరంజీవి
  • శర్వా నా బిడ్డ అంటూ వాత్సల్యం ప్రదర్శించిన మెగాస్టార్
Chiranjeevi attends Sreekaram pre release event

శర్వానంద్ హీరోగా రూపుదిద్దుకున్న శ్రీకారం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖమ్మంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, శర్వానంద్ ను తమ కుటుంబంలో ఒకడిగానే భావిస్తామని స్పష్టం చేశారు. తమకు రామ్ చరణ్ ఎలాగో, శర్వానంద్ కూడా అంతేనని వివరించారు. శర్వా తమ కుటుంబంలో కలిసిపోతాడని పేర్కొన్నారు.

ఓసారి అతడితో కలిసి ఓ యాడ్ లో నటించానని, ఆపై శంకర్ దాదా ఎంబీబీఎస్ లోనూ తనతో శర్వా నటించాడని చిరంజీవి తెలిపారు.

ఇక శ్రీకారం చిత్రం గురించి చెబుతూ... నా బిడ్డ శర్వానంద్ కు ఆల్ ది బెస్ట్ అంటూ దీవించారు. వ్యవసాయం అవసరం, గొప్పతనం గురించి వివరించే చిత్రమిదని అన్నారు. వ్యవసాయం ఆవశ్యకతను అందరికీ వివరించేందుకు సరైన సమయంలో వస్తున్న చిత్రం అని పేర్కొన్నారు.

తిరుమల కిశోర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా మార్చి 11న శివరాత్రి సందర్భంగా రిలీజ్ అవుతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంది.