మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కారు ఉమెన్స్ డే కానుక

08-03-2021 Mon 20:57
  • నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
  • సాధారణ సెలవులు 20కి పెంపు
  • ఇప్పటివరకు 15గా ఉన్న సాధారణ సెలవులు
  • దిశ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
  • పలువురు మహిళలకు సన్మానం
AP Government increases casual leaves to twenty for women employees

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు కానుక అందించింది. ప్రభుత్వ ఉద్యోగినులకు ఇప్పటివరకు 15 సాధారణ సెలవులు ఇస్తుండగా, ఇకపై వాటి సంఖ్యను 20కి పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగినుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

కాగా, సీఎం జగన్ ఇవాళ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దిశ వాహనాలను ప్రారంభించారు. 900 దిశ స్కూటీలను, 18 దిశ క్రైమ్ సీన్ మేనేజ్ మెంట్ వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ వాహనాలను జీపీఎస్ తో పాటు, దిశ యాప్ రెస్పాన్స్ సిస్టమ్ తో అనుసంధానం చేశారు.

అంతేకాదు, మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన పోలీసు కానిస్టేబుల్ సరస్వతి, పారిశుద్ధ్య కార్మికురాలు మాబున్నీసా, వలంటీరు కల్యాణి, ఆరోగ్య కార్యకర్త శాంతిలను సన్మానించారు.