సీఎం కావాలనుకుంటే ఆయన మళ్లీ కాంగ్రెస్ లోకి రావాల్సిందే: రాహుల్ గాంధీ

08-03-2021 Mon 20:10
  • కాంగ్రెస్ లో ఉంటే సింధియా సీఎం అయ్యేవారు
  • బీజేపీలోకి వెళ్లి బ్యాక్ బెంచర్ అయిపోయారు
  • సింధియా ఎప్పటీకీ సీఎం కాలేరు
Jyotiraditya Scindia Has To Return to Congress to become CM says Rahul Gandhi

జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ లోనే ఉండి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని... కానీ, బీజేపీలోకి వెళ్లి ఆయన బ్యాక్ బెంచర్ అయిపోయారని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ గొప్పదనం గురించి ఆ పార్టీ యూత్ వింగ్ తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసే శక్తి సింధియాకు ఉందని అన్నారు. ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి అవుతావంటూ సింధియాకు తాను చెప్పానని... కానీ, ఆయన మరో మార్గాన్ని ఎంచుకున్నారని చెప్పారు.

'నేను చెపుతున్న విషయాన్ని రాసి పెట్టుకోండి. సింధియా ఏ రోజూ సీఎం కాలేరు. ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి' అని రాహుల్ అన్నారు. ఆరెస్సెస్ సిద్ధాంతాలపై యూత్ కాంగ్రెస్ సభ్యులు పోరాడాలని... ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని విమర్శించారు. గత ఏడాది మార్చిలో కాంగ్రెస్ కు గుడ్ బై  చెప్పిన సింధియా బీజేపీలో చేరారు.