రేపిస్టును పెళ్లాడాలని నేనెవరికీ, ఎప్పుడూ సూచించలేదు: సీజేఐ ఎస్ఏ బోబ్డే

08-03-2021 Mon 18:39
  • ఇటీవల ఓ అత్యాచార కేసు విచారణ 
  • అత్యాచార బాధితురాలిని పెళ్లాడాలని బోబ్డే సూచించినట్టు వార్తలు
  • అంగీకరిస్తే కోర్టు సాయం చేస్తుందని ఆయన అన్నట్టు కథనాలు 
  • మహిళల పట్ల తమకు అత్యంత గౌరవం ఉందని ఉద్ఘాటన
CJI SA Bobde clarifies he never asks any one to marry rapist

ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా బాధితురాలిని పెళ్లాడాలని నిందితుడికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే సూచించినట్టుగా కథనాలు వచ్చాయి. ఈ విషయంలో న్యాయస్థానం సాయం చేస్తుందని ఆయన అన్నట్టు వార్తలు వచ్చాయి.

దీనిపై విమర్శలు వస్తుండడంతో సీజేఐ ఎస్ఏ బోబ్డే స్పందించారు. రేపిస్టును పెళ్లాడాలని తాను ఎవరినీ అడగలేదని స్పష్టం చేశారు. మహిళలపై సుప్రీంకోర్టుకు అత్యంత గౌరవం ఉందని ఉద్ఘాటించారు. ఈ కేసు విచారణ ఏ దశలోనూ తాము అలాంటి ప్రతిపాదనలు చేయలేదని వెల్లడించారు. తమకు గుర్తున్నంత వరకు ఇలాంటి కేసు ఏదీ తమ ముందు విచారణకు రాలేదని బోబ్డే స్పష్టం చేశారు.