టీడీపీలో చేరతా: వైసీపీ మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు

08-03-2021 Mon 18:32
  • వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయి
  • స్థానిక ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడింది
  • ఒంగోలు కోసం బాలినేని చేసింది ఏమీ లేదు
YSRCP Ex MLA joining TDP

 త్వరలోనే తాను టీడీపీలో చేరబోతున్నానని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపించారు. టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తూ, ఏకగ్రీవాలు చేసుకుంటోందని మండిపడ్డారు. ఇదే సమయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై కూడా ఆయన మండిపడ్డారు.

ఏ ముఖం పెట్టుకుని ఒంగోలు ప్రజలను బాలినేని ఓట్లు అడుగుతారని డేవిడ్ రాజు ప్రశ్నించారు. ఒంగోలులో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని... నగర అభివృద్ధి కోసం ఆయన చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఒంగోలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. డేవిడ్ రాజు చేసిన వ్యాఖ్యలు వైసీపీకి షాకిచ్చాయి.