బ్యాడ్మింటన్ క్వీన్ 'సైనా' నెహ్వాల్ బయోపిక్ ట్రైలర్ విడుదల

08-03-2021 Mon 17:26
  • సైనా జీవితకథ ఆధారంగా 'సైనా' బయోపిక్
  • సైనా పాత్రలో పరిణీతి చోప్రా
  • అమోల్ గుప్తే దర్శకత్వం
  • మార్చి 26న విడుదల
Saina biopic trailer out now

భారత బ్యాడ్మింటన్ కీర్తి పతాకను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవితకథ ఆధారంగా 'సైనా' అనే బయోపిక్ తెరకెక్కుతోంది. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'సైనా' ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ బయోపిక్ లో సైనా పాత్రను బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పోషిస్తోంది. సైనాలా కనిపించేందుకు పరిణీతి ఫిట్ నెస్ పరంగా ఎంతో శ్రమించింది. పైగా బ్యాడ్మింటన్ లోనూ మెళకువలు నేర్చుకుని సైనా పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోంది.

'సైనా' చిత్రానికి అమోల్ గుప్తే దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ ఫిలింస్, ఫ్రంట్ ఫుట్ పిక్చర్స్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి అమాల్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు. 'సైనా' బయోపిక్ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.