తీవ్ర ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు

08-03-2021 Mon 16:34
  • 36 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 18 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3.43 శాతం లాభపడ్డ ఎల్ అండ్ టీ
Sensex closes 36 points high

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లి... చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 36 పాయింట్లు లాభపడి 50,441కి చేరుకుంది. నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 14,956 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (3.43%), ఓఎన్జీసీ (2.96%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.22%), యాక్సిస్ బ్యాంక్ (1.60%), ఇన్ఫోసిస్ (1.54%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-2.22%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.05%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.81%), భారతి ఎయిల్ టెల్ (-1.26%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.20%).