మహిళలకు రక్షణ ఎవరు కల్పిస్తారు?: గల్లా జయదేవ్

08-03-2021 Mon 15:38
  • కనకదుర్గ దర్శనానికి వెళ్లిన అమరావతి మహిళా రైతులు
  • ప్రకాశం బ్యారేజ్ వద్ద అడ్డుకున్న పోలీసులు
  • మహిళా దినోత్సవం రోజు మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన బహుమతి అని గల్లా ఆగ్రహం
Who will protect women asks Galla Jayadev

మహిళాదినోత్సవం రోజున విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లిన అమరావతి మహిళా రైతులను పోలీసులు అడ్డుకున్న  ఘటనపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా జయదేవ్ స్పందిస్తూ మహిళలను అడ్డుకుంటున్న ఫొటోలను షేర్ చేశారు.

'ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, గాయాలు, అవమానాలు, ఇవి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున వైసీపీ ప్రభుత్వం మరియు ఏపీ పోలీసులు మహిళలకు ఇచ్చిన బహుమతులు. మహిళలను గుర్తించవలసిన ఈ రోజు, వారిని అగౌరవపరచడం హేయనీయం. పోలీసుల ప్రవర్తనే ఇలా ఉంటే రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎవరు కల్పిస్తారు?' అని ప్రశ్నించారు.