ఓ మహిళపై అశోక్ గజపతి రాజు చేయి చేసుకున్నాడంటూ సంచయిత ఆగ్రహం!

08-03-2021 Mon 14:54
  • విజయనగరంలో ఎన్నికల ప్రచారం
  • పాల్గొన్న అశోక్ గజపతిరాజు
  • మహిళపై చేయి చేసుకున్నట్టు వీడియో ద్వారా వెల్లడి
  • మహిళా ద్వేషి అంటూ సంచయిత వ్యాఖ్యలు
 Sanchaitha comments on Ashok Gajapati Raju
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విజయనగరంలో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సంఘటనలో ఆయన ఓ మహిళపై చేయిచేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత గజపతి స్పందించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే తీరు ఇదేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుష అహంకార భావజాలంతో ఉన్న ఒక మహిళా ద్వేషి నుంచి ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం అని విమర్శించారు. అశోక్ గజపతిరాజు రామతీర్థం ఆలయానికి గౌరవ చైర్మన్ గా ఉన్నారని, ఇప్పుడాయన తన అసలు రంగు బయటపెడుతున్నాడని సంచయిత వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ ఘటన తాలూకు వీడియోను కూడా సంచయిత పంచుకున్నారు.