Lawrence: కమల్ సినిమాలో విలన్ గా ప్రముఖ నటుడు?

Lawrence to play antagonist for Kamal Hassan
  • లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ 
  • 'విక్రమ్' అనే టైటిల్ ఇప్పటికే ఖరారు  
  • ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్
  • విలన్ పాత్రలో నటించనున్న లారెన్స్

నృత్య దర్శకుడిగా తనదైన ముద్రవేసిన తర్వాత హీరోగా మారిన లారెన్స్ కథానాయకుడుగానూ రాణిస్తున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. తాను సూపర్ స్టార్ రజనీకాంత్ కు గొప్ప అభిమానినని లారెన్స్ గర్వంగా చెప్పుకుంటాడు. అలాంటి లారెన్స్ ఇప్పుడు మరో ప్రముఖ నటుడు కమలహాసన్ సినిమాలో నటించనున్నాడు. అందులోనూ కమల్ కు విలన్ గా కనిపించనున్నాడు.. ఇక్కడ అదే పెద్ద విశేషం,!

ఇటీవల వరుస విజయాలు అందుకున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తన తాజా చిత్రాన్ని కమలహాసన్ హీరోగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి 'విక్రమ్' అనే టైటిల్ని కూడా ఖరారు చేశారు. కమల్ తమ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగును ఏప్రిల్ నుంచి నిర్వహిస్తారు. ఇక ఇందులో ప్రధాన విలన్ పాత్రకుగాను తాజాగా లారెన్స్ తో దర్శకుడు లోకేశ్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరి, లారెన్స్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? అన్నది చూడాలి!

  • Loading...

More Telugu News