TMC: బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి వాస్తవానికి ఓ నక్సలైట్: విరుచుకుపడిన తృణమూల్

  • నిన్న బీజేపీలో చేరిన మిథున్ చక్రవర్తి
  • నాలుగు పార్టీలు మారిన ఆయనకు విశ్వసనీయత ఎక్కడిదన్న టీఎంసీ
  • ఈడీని చూపి బెదిరించడంతోనే బీజేపీలో చేరారని ఆరోపణ
Saugata Roy says mithun chakraborty has no credibility

నిన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్న బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తిపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆయనో నక్సలైట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మిథున్‌ వాస్తవానికి ఓ నక్సలైట్ అని, ఇప్పటికి నాలుగుసార్లు పార్టీలు మారారని ఆ పార్టీ ఎంపీ సౌగత రాయ్ ఆరోపించారు. నిన్నటి తరం నటుడైన ఆయనకు ఎలాంటి విశ్వసనీయత లేదని, ప్రజలను ఆయన ప్రభావితం చేయలేరని పేర్కొన్నారు. ఈడీని చూపించి బెదిరించడంతో భయపడి మిథున్ బీజేపీలో చేరారని విమర్శించారు.

నక్సలైట్ అయిన మిథున్ తొలుత సీపీఎంలో చేరారని, ఆ తర్వాత టీఎంసీలో చేరి రాజ్యసభ సభ్యుడు అయ్యారని,  ఇప్పుడు బీజేపీ బెదిరింపులకు భయపడి ఆ పార్టీ పంచన చేరారని సౌగత్ రాయ్ తీవ్ర విమర్శలు చేశారు. కాగా, నిన్న కోల్‌కతాలో నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో మిథున్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

More Telugu News