కరోలినా మారిన్ చేతిలో మరోసారి ఓడిన పీవీ సింధు!

08-03-2021 Mon 07:07
  • చిరకాల ప్రత్యర్థి చేతిలో మరో ఓటమి
  • పూర్తిగా చేతులెత్తేసిన పీవీ సింధు
  • స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ లో రన్నరప్ మాత్రమే
Carolina Marin Defeats PV Sindhu One More Time

తన చిరకాల ప్రత్యర్థి కరోలినా మారిన్ చేతిలో మరోసారి ఓటమి పాలైన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, ఈ సంవత్సరం తొలి ఇంటర్నేషనల్ టైటిల్ ను సాధించాలన్న కలను మరికొంత కాలం వాయిదా వేసుకుంది. బాసెల్ లో జరుగుతున్న స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ - 300లో భాగంగా మహిళల సింగిల్స్ ఫైనల్ లో రియో ఒలింపిక్స్ చాంపియన్, స్పెయిన్ కు చెందిన మారిన్ చేతిలో 12-21, 5-21 తేడాతో ఓడిపోయింది. తొలి గేమ్ లో కాస్తంత పోటీని ఇచ్చిన సింధు, రెండో గేమ్ లో పూర్తిగా చేతులెత్తేయడం గమనార్హం. దీంతో ఈ టోర్నీలో రన్నరప్ ట్రోఫీతోనే సింధు సరిపెట్టుకోవాల్సి వచ్చింది.