రేపు మహిళా దినోత్సవం... మహిళా ఉద్యోగులకు సెలవు మంజూరు చేసిన తెలంగాణ సర్కారు

07-03-2021 Sun 17:04
  • మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం
  • ప్రత్యేక సాధారణ సెలవుగా పేర్కొన్న ప్రభుత్వం
  • సీఎస్ పేరిట ఉత్తర్వులు జారీ
  • సచివాలయ విభాగాధిపతులకు, కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ
Telangana government issues special causal leave for women employees on womens day

రేపు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్ పేరిట సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగ సంక్షేమ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను తెలంగాణ సచివాలయంలోని అన్ని విభాగాలకు, అన్ని విభాగాల అధిపతులకు, అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపారు.