ఐటీఐఆర్ పై జంతర్ మంతర్ వద్ద దీక్షకు మేం సిద్ధం... మీరు సిద్ధమా?: కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

07-03-2021 Sun 16:08
  • కేటీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ
  • దీక్షతో మోదీపై ఒత్తిడి పెంచుదామని పిలుపు
  • కేటీఆర్ స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్
  • తన సవాల్ స్వీకరించకపోతే మోదీ తొత్తులుగా భావిస్తానని వెల్లడి
  • తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని వ్యాఖ్యలు
Revanth Reddy open letter to KTR

తెలంగాణ ఐటీ మంతి కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఐటీఐఆర్, విభజన చట్టం హామీలు, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా అంశాలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు తాము సిద్ధమని, మీరు కూడా సిద్ధమా? అని సవాల్ విసిరారు. దేశ రాజధానిలో దీక్షతో ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచుదామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

తన సవాల్ కు కేటీఆర్ స్పష్టమైన సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. మీ దొడ్లో కుక్కలతో మొరిగించే ప్రయత్నం చేయొద్దు అని స్పష్టం చేశారు. తన సవాల్ ను కేటీఆర్ స్వీకరించకుంటే మోదీ తొత్తులుగా, శాశ్వతంగా తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.