ఇదా పిల్లలకు మధ్యాహ్న భోజనం..?... స్పీకర్ తమ్మినేని అర్ధాంగి ఉగ్రరూపం... వీడియో ఇదిగో!

07-03-2021 Sun 14:51
  • పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన స్పీకర్ అర్ధాంగి
  • శ్రీకాకుళం జిల్లా తొగరం పంచాయతీ సర్పంచ్ గా ఎన్నిక
  • మధ్యాహ్న భోజనం తీరుతెన్నులపై పరిశీలన
  • అధికారులపై ఆగ్రహం
  • నాసిరకమైన ఆహారం అందిస్తున్నారని మండిపాటు
Tammineni Vanisri fires on officials after seen vulnerable mid day meal

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అర్ధాంగి తమ్మినేని వాణిశ్రీ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని తొగరం సర్పంచ్ గా ఎన్నికయ్యారు. కాగా, తొగరం పంచాయతీ పరిధిలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని వాణిశ్రీ స్వయంగా పరిశీలించారు.

అన్నం దారుణంగా ఉండడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధింత అధికారులకు ఫోన్ చేసి చెడామడా వాయించేశారు. ఇదేమన్నా పిల్లలు తినే అన్నమేనా..? అంటూ నిప్పులు చెరిగారు. ఇప్పటివరకు పలుమార్లు హెచ్చరించానని, ఇక యాక్షన్ లోకి దిగుతానని స్పష్టం చేశారు. స్పష్టమైన ఆధారాలతో సీఎం జగన్ ను కలుస్తానని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.