తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ మనవడు ర్యాగింగ్ చేశాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు

07-03-2021 Sun 13:41
  • ఇంజినీరింగ్ కాలేజీలో థ‌ర్డ్ ఇయ‌ర్ చ‌దువుతున్న ఫ‌రాన్
  • పోలీసుల‌కు రియాన్ అనే విద్యార్థి ఫిర్యాదు
  • ఫ‌రాన్ ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్న తోటి విద్యార్థులు
compalint against faran

తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ మనవడు ర్యాగింగ్ చేశాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. మ‌హ‌మూద్ అలీ మనవడు ఫరాన్ హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నం.3లోని ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీలో థ‌ర్డ్ ఇయ‌ర్ చ‌దువుతున్నాడు.

అయితే, అత‌డు ర్యాగింగ్ కు పాల్ప‌డుతున్నాడ‌ని, త‌మ‌ను వేధిస్తున్నాడ‌ని అదే కాలేజీకి చెందిన బీటెక్‌ విద్యార్థి రియాన్‌ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. త‌మ‌ను ఫ‌రాన్ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని మ‌రికొంద‌రు విద్యార్థులు మీడియాకు తెలిపారు. త‌మ చేతిక‌యిన ‌గాయాల‌ను చూపించారు. అతడి నుంచి తమను కాపాడాలని కోరారు. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.