నిహారిక కాలికి గాయం.. ఫొటో పోస్ట్ చేసిన నాగ‌బాబు కూతురు

07-03-2021 Sun 13:12
  • నిహారిక‌కు చైత‌న్య సేవ‌లు
  • బ్రోకెన్ వైఫ్‌ను భర్త పాంపర్ చేస్తున్నాడంటూ కామెంట్
  • షూటింగ్ స‌మ‌యంలో గాయం?
niharika pic goes viral

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూతురు నిహారికకు చైత‌న్య అనే యువ‌కుడితో గ‌త ఏడాది పెళ్లి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కొత్త జంటకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో కొన్ని నెల‌లుగా అల‌రిస్తున్నాయి. తాజాగా, త‌న ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో నిహారిక పోస్ట్ చేసిన ఓ ఫొటో వైర‌ల్ అవుతోంది.

ఇందులో నిహారిక కాలికి బ్యాండేజ్ ఉంది. దీంతో ఆమె విశ్రాంతి తీసుకుంటుండ‌డంతో చైత‌న్య సేవ‌లు అందిస్తున్నాడు. బ్రోకెన్ వైఫ్‌ను తన భర్త పాంపర్ చేస్తున్నాడంటూ నిహారిక పేర్కొంది.

కాగా, పెళ్లి త‌ర్వాత కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లో న‌టిస్తూ నిహారిక బిజీగా ఉంది. వాటి షూటింగ్ లో పాల్గొన్న‌ స‌మయంలోనే నిహారిక కాలుకు ఫ్రాక్చ‌ర్ అయిన‌ట్లు తెలుస్తోంది. కాగా, త‌నకు సంబంధించిన ఫొటోల‌ను త‌రుచూ పోస్ట్ చేస్తూ సామాజిక మాధ్య‌మాల్లో నిహారిక చాలా చురుకుగా ఉంటుంది.