సొంత అక్క‌, అన్న‌ను న‌రికి చంపిన త‌మ్ముడు

07-03-2021 Sun 11:47
  • శ్రీకాకుళం జిల్లా  రణస్థలం మండలంలో ఘ‌ట‌న‌
  • ఆస్తిత‌గాదాలే కార‌ణం?
  • ద‌ర్యాప్తు చేస్తోన్న పోలీసులు
man kills elder brother sister

కుటుంబ త‌గాదాల కార‌ణంగా సొంత అక్క‌, అన్న‌ను దారుణంగా న‌రికి చంపాడు ఓ వ్య‌క్తి. ఈ ఘ‌ట‌న శ్రీకాకుళం జిల్లా  రణస్థలం మండలం రామచంద్రాపురంలో ఈ రోజు ఉద‌యం చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే...  రామచం‍ద్రాపురం గ్రామానికి చెందిన గొర్లె రామకృష్ణ అనే వ్యక్తి  తన సొంత అక్క జయమ్మ, అన్న సన్యాసి లను హ‌త్య చేశాడు.

భూవివాదాల‌ కార‌ణంగా వారి మ‌ధ్య కొంత కాలంగా విభేదాలు రాజుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే సొంత అక్క‌, అన్నపై రామ‌కృష్ణ ప‌గ పెంచుకున్నాడు. ఈ రోజు ఉద‌యం అన్న స‌న్యాసి పాలు పిండుతోన్న స‌మ‌యంలో ఆయ‌న వ‌ద్ద‌కు క‌త్తితో వచ్చిన త‌మ్ముడు రామ‌కృష్ణ దాడి చేశాడు. అదే స‌మ‌యంలో అక్క జ‌య‌మ్మ కూడా అక్క‌డ‌కు రావ‌డంతో ఆమెనూ పొడిచి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.