Telangana: తెలంగాణ‌లో భ‌య‌పెడుతోన్న‌ ఎండల తీవ్రత

  • నేడు, రేపు మ‌రింత పెర‌గ‌నున్న ఉష్ణోగ్ర‌త‌లు
  • సాధా‌రణం కంటే మూడు డిగ్రీలు పెరిగే అవ‌కాశం
  • హైద‌రా‌బా‌ద్‌లో నిన్న‌ 37.2 డిగ్రీల సెల్సియ‌స్ గ‌రిష్ఠ‌ ఉష్ణోగ్ర‌త
increases heat in telangana

తెలంగాణ‌లో భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు ఉక్క‌పోత పెరిగిపోతోంది. ఎండాకాలం ప్రారంభంలోనే అత్య‌ధిక స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. రానున్న రోజుల్లో ఎండ‌ల తీవ్ర‌త‌ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.  నేడు, రేపు సాధా‌రణ ఉష్ణోగ్ర‌త‌ల కంటే మూడు డిగ్రీల మేర పెరిగే అవ‌కా‌శా‌లు‌న్నట్టు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కా‌రులు తెలిపారు.

ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలు‌ల‌తో ఈ ప‌రిస్థితి నెల‌కొంటోంద‌ని వివరించారు. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో ఉష్ణో‌గ్ర‌తలు పెరిగే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. కాగా, నిన్న రాష్ట్రంలోని ప‌లు జిల్లాలో ఉష్ణోగ్ర‌త‌లు అధికంగా న‌మోద‌య్యాయి.

హైద‌రా‌బా‌ద్‌లో 37.2 డిగ్రీల సెల్సియ‌స్‌గా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. ఇక‌ ఆది‌లా‌బా‌ద్‌లో 38, భద్రా‌చ‌లంలో 38.5 , హన్మ‌కొం‌డలో 35,  ఖమ్మంలో 36.2, మహ‌బూ‌బ్‌‌న‌గ‌ర్‌లో 37.4, మెద‌క్‌లో 37 డిగ్రీలు, నల్ల‌గొం‌డలో 34.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత న‌మోదైంది.

More Telugu News