వివాహ దశ వార్షికోత్సవం... తాజ్ మహల్ ముందు అల్లు అర్జున్, స్నేహారెడ్డిల సందడి!

07-03-2021 Sun 09:16
  • 2011లో అల్లు అర్జున్ - స్నేహారెడ్డిల వివాహం
  • నిన్న తాజ్ మహల్ ను సందర్శించిన కపుల్
  • వైరల్ అవుతున్న చిత్రాలు
Allu Arjun Snehareddy 10th Marriage anniversary at Tajmahal

టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ అల్లు అర్జున్ - స్నేహారెడ్డిల వివాహం జరిగి అప్పుడే పదేళ్లు పూర్తయిపోయాయి. 2011లో వారిద్దరి వివాహం జరుగగా, నిన్న టెన్త్ యానివర్సరీని ఇద్దరూ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించిన వారిద్దరూ, అక్కడ సందడి చేశారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డిలు తాజ్ వద్ద దిగిన చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఈ జంటకు అయాన్, అర్హ అనే పిల్లలు ఉన్నారన్న సంగతి తెలిసిందే. వీరి వివాహ వార్షికోత్సవం చిత్రాలను చూసిన వారంతా, మరెన్నో యానివర్సరీలు జరుపుకోవాలని కోరుతూ శుభాభినందనలు చెబుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా తుది దశకు షూటింగ్ చేరుకోగా, ఆగస్టు 13న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.