Pawan Kalyan: 'పవన్ నా ఫస్ట్ లవ్ అంతే... మీరంటున్న మాటలు నేననలేదు'... ఘాటుగా స్పందించిన నటి అషూ రెడ్డి!

Actress Ashu Reddy Warning on Social Media Troling
  • ఇటీవల పవన్ ను కలిసిన అషూ రెడ్డి
  • నాలుగో భార్యగా ఉంటానని అన్నట్టు వార్తలు
  • పిచ్చిపిచ్చిగా వాగవద్దని వార్నింగ్
"నా దేవుడిని మళ్లీ కలుసుకున్నాను. ఆయన నన్ను గుర్తు పట్టారు. నా పచ్చబొట్టును కూడా గుర్తుంచుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు మాట్లాడారు. అదో నా మధుర జ్ఞాపకం, వెళ్లే ముందు నాకో లెటర్ కూడా ఇచ్చారు. మీరు ఎప్పుడూ నా ఫస్ట్ లవ్ పవన్ కల్యాణ్" అంటూ కామెంట్ చేస్తూ, పవన్ తో దిగిన ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో నటి అషూ రెడ్డి పోస్ట్ చేసిన తరువాత ఆమెపై నెటిజన్ల ట్రోలింగ్స్ ప్రారంభం అయ్యాయి. పవన్ అంగీకరిస్తే, ఆయనకు నాలుగో భార్యగా వెళతానని అషూ రెడ్డి వ్యాఖ్యానించినట్టూ వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో అషూ రెడ్డి ఘాటుగా స్పందించింది. తాను పవన్ కల్యాణ్ కు అభిమానిని మాత్రమేనని, ఎప్పటికైనా అలాగే ఉంటానని, తప్పుడు వార్తలు రాయవద్దని వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల తన చిత్రంలో నటించిన వారికి, సాంకేతిక నిపుణులకు సత్కారం చేసిన పవన్, వారితో ఫోటోలు దిగి, వారిని అభినందిస్తూ, లేఖలు రాశారు. దాన్ని గురించి ప్రస్తావించడమే అషూ రెడ్డిపై ట్రోలింగ్స్ కు కారణమైంది. తన గురించి సామాజిక మాధ్యమాల్లో పిచ్చి రాతలు రాస్తున్నారని మండిపడిన ఆమె, పవన్ తనకు దేవుడితో సమానమని వ్యాఖ్యానించింది.

చాలామంది మనోభావాలను దెబ్బతినేలా, వేరేవాళ్లను విమర్శిస్తూ, వ్యాఖ్యలు చేస్తున్నారని, అటువంటి వార్తలపై స్పందించాల్సిన అవసరం లేకున్నా, ఓపిక నశించి ఈ వీడియోను విడుదల చేస్తున్నానని వ్యాఖ్యానించింది. వార్తల్లో, సోషల్ మీడియాలో వచ్చినట్టుగా తాను ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదని, అభిమానిగా తాను చచ్చేంత వరకూ అలాగే ఉంటానని చెప్పింది. అంతకన్నా ఇంకేమీ లేదని, తన పేరును పాడు చేయవద్దని పేర్కొంది.

కాగా, బిగ్ బాస్ సీజన్ -3లో కంటెస్టెంట్ గా పాల్గొన్న అషూ రెడ్డి, ఆపై పవన్ హీరోగా తెరకెక్కిన 'వకీల్ సాబ్'లో చాన్స్ దక్కించుకుందన్న సంగతి తెలిసిందే.

Pawan Kalyan
Ashu Reddy
Trolls
Warning

More Telugu News