ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ది సహజ మరణం కాదు: పోలీసులు

06-03-2021 Sat 22:24
  • నిన్న ఢిల్లీలో మరణించిన జార్జ్ ముత్తూట్
  • భవనం పైనుంచి పడి చనిపోయారన్న పోలీసులు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని వెల్లడి
  • ఆయన మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టీకరణ
Police clarifies over George Muthoot death

ముత్తూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ జార్జ్ ముత్తూట్ (71) నిన్న ఢిల్లీలోని తన నివాసంలో మరణించారు. అయితే ఆయన మరణానికి గల కారణాలను పోలీసులు ఇవాళ వెల్లడించారు. ముత్తూట్ గ్రూప్ చైర్మన్ మృతి సహజ మరణం కాదని తెలిపారు. ప్రమాదవశాత్తు జార్జ్ ముత్తూట్ భవనం పైనుంచి పడి చనిపోయారని స్పష్టం చేశారు.

జార్జ్ నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడని ఢిల్లీ పోలీసులు వివరించారు. ఆ సమయంలో ఆయనను ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రికి తరలించారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని తెలిపారు. ఆయన మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని అన్నారు.