భూమి విలువ చూసిన జగన్ కు త్యాగం విలువ తెలియదు: వైజాగ్ జగదాంబ సెంటర్లో చంద్రబాబు వ్యాఖ్యలు

06-03-2021 Sat 21:40
  • విశాఖలో చంద్రబాబు స్థానిక ఎన్నికల ప్రచారం
  • సీఎం జగన్ పై విమర్శలు
  • త్యాగాలకు విలువ లేకుండా చేస్తున్నాడని వ్యాఖ్యలు
  • వైసీపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు అంగీకరించినట్టేనని వెల్లడి
Chnadrababu municiapl elections campaign at Vizag Jagadamba Center

స్థానిక ఎన్నికల ప్రచారం కోసం విశాఖలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు జగదాంబ సెంటర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉక్కు కర్మాగారం అంశాన్ని ప్రస్తావిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. భూమి విలువ చూసిన జగన్ కు త్యాగం విలువ తెలియదని అన్నారు. అందుకే స్టీల్ ప్లాంటు భూములను విక్రయించాలని అంటున్నాడని ఆరోపించారు.

విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని, వారి త్యాగాలకు జగన్ విలువ లేకుండా చేస్తున్నాడని విమర్శించారు. విశాఖ నగరపాలక ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రజలు అంగీకారం తెలిపినట్టు అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రౌడీలు, గూండాల నుంచి విశాఖను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు.