మహేశ్ బాబు కోసం కొత్త కారవాన్... ఫొటోలు వైరల్!

06-03-2021 Sat 20:04
  • టాలీవుడ్ లో పెరుగుతున్న కారవాన్ సంస్కృతి
  • ఇప్పటివరకు సాధారణ కారవాన్ ఉపయోగించిన మహేశ్ బాబు
  • తాజాగా అన్ని హంగులతో సరికొత్త కారవాన్ సిద్ధం
  • అభిమానులను అలరిస్తున్న కారవాన్ ఫొటోలు
New caravan for Mahesh Babu

ఇటీవల కాలంలో టాలీవుడ్ లోనూ కారవాన్ సంస్కృతి ఊపందుకుంది. అగ్రతారలు షూటింగ్ గ్యాప్ లో విశ్రాంతి కోసం కారవాన్ లను అందుబాటులో ఉంచుకుంటున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా తమకు అవసరమైన అన్ని సౌకర్యాలు, హంగులతో కారవాన్ లను తయారుచేయించుకుంటున్న టాలీవుడ్ హీరోల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాగా, సూపర్ స్టార్ మహేశ్ బాబు కోసం కొత్త కారవాన్ సిద్ధమైంది.

ఇప్పటివరకు మహేశ్ బాబు సాధారణమైన కారవాన్ నే వినియోగిస్తున్నారు. అయితే ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా అన్ని ఆధునిక సదుపాయాలతో కూడిన సరికొత్త కారవాన్ ను తెప్పించుకున్నట్టు తెలుస్తోంది.. ఈ మేరకు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది. మహేశ్ బాబు కారవాన్ ఫొటోలంటూ అభిమానులు వైరల్ చేస్తున్నారు.