వాట్సాప్ లో ఫొటో చూసి పెళ్లికి ఓకే చెప్పిన అమ్మాయి... వరుడ్ని ప్రత్యక్షంగా చూసి పెళ్లికి నిరాకరణ

06-03-2021 Sat 19:07
  • బీహార్ లో ఘటన
  • అనిల్ కుమార్ అనే యువకుడికి పెళ్లి నిశ్చయం
  • అనిల్ ను ఫొటోలో చూసిన అమ్మాయి
  • పెళ్లిమండపం వద్ద చూసి దిగ్భ్రాంతికి గురైన వైనం
  • వివాహ వేదిక నుంచి పారిపోయిన వధువు
Bride runway after seen groom in reality

బీహార్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పశ్చిమ చంపారన్ జిల్లాలో ఓ యువతికి పెళ్లి నిశ్చయమైంది. వరుడు అనిల్ కుమార్ ను ఆమె నేరుగా చూడకపోయినా, వాట్సాప్ లో పంపిన ఫొటో చూసి పెళ్లికి అంగీకరించింది. దాంతో రెండు కుటుంబాల్లో పెళ్లిసందడి నెలకొంది. ఎంతో ఉత్సాహంగా పెళ్లిపనులు షురూ చేశారు. ఓ సుముహూర్తాన పెళ్లి చేసుకునేందుకు వరుడు, అతని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు.

అయితే, మాంగల్యధారణ జరిగే సమయంలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అప్పటివరకు పెళ్లికొడుకును ప్రత్యక్షంగా చూడని వధువు... పెళ్లికొడుకును తేరిపార చూసి దిగ్భ్రాంతికి గురైంది. పెళ్లికొడుకు ఫొటోలో చూసిన విధంగా లేడంటూ అక్కడ్నించి పారిపోయింది. కుటుంబసభ్యులు ఎంత నచ్చచెప్పినా అతడ్ని పెళ్లి చేసుకునేందుకు ససేమిరా అంది. దాంతో పెళ్లిమండం కాస్తా రణరంగమే అయింది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో రసాభాసగా మారింది. పాపం, పెళ్లి చేసుకోకుండానే పెళ్లికొడుకు అనిల్ కుమార్ వెనుదిరగక తప్పలేదు.