తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఇదిగో!

06-03-2021 Sat 18:26
 • షెడ్యూల్ ప్రకటించిన ఎంసెట్ కమిటీ
 • మార్చి 18న నోటిఫికేషన్
 • మార్చి 20 నుంచి మే 18 వరకు దరఖాస్తుల స్వీకరణ
 • జూలై 5 నుంచి 9 వరకు పరీక్షలు
 • ఆన్ లైన్ లో రోజూ రెండు దశల్లో పరీక్షలు
Telangana EAMCET Schedule announced

తెలంగాణలో తాజాగా ఎంసెట్ షెడ్యూల్ ప్రకటించారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశానికి జూలై 5 నుంచి 9 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎంసెట్ కమిటీ వెల్లడించింది. కాగా, ఈసారి ఎంసెట్ కు ఇంటర్ ఫస్టియర్ కు సంబంధించిన 100 శాతం సిలబస్, సెకండియర్ కు చెందిన 70 శాతం సిలబస్ ను ఇస్తున్నట్టు కమిటీ ఇంతకుముందే నిర్ణయించింది. ఆన్ లైన్ విధానంలో ప్రతిరోజూ రెండు దశల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

ఎంసెట్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు...

 • మార్చి 18న నోటిఫికేషన్ విడుదల
 • మార్చి 20 నుంచి మే 18 వరకు దరఖాస్తుల స్వీకరణ
 • లేట్ ఫీజుతో జూన్ 28 వరకు దరఖాస్తుల స్వీకరణ
 • జూలై 5 నుంచి 9 వరకు పరీక్షలు
 • జూలై 5,6 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల ప్రవేశ పరీక్షలు
 • జూలై 7,8,9 తేదీల్లో ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు