ఇన్ని గెటప్పులు వేయడం చంద్రబాబుకి, ఆయన మావగారికి మాత్రమే సాధ్యమైంది: పేర్ని నాని

06-03-2021 Sat 17:03
  • మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం
  • తాను మారానని చంద్రబాబు చెబుతున్నాడన్న పేర్ని నాని
  • 2014కి ముందు కూడా ఇదే చెప్పాడని వెల్లడి
  • మనిషన్నవాడు ఎన్నిసార్లు మారతాడని వ్యాఖ్యలు
AP Minister Perni Nani slams TDP Chief Chandrababu

ఏపీ రవాణా మంత్రి పేర్ని నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. "2014 ఎన్నికలకు ముందు ఊరూరా తిరుగుతూ నేను మారాను నమ్మండి అన్నాడు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల పాటు తన విశ్వరూపం ప్రదర్శించాడు. మళ్లీ ఇప్పుడు నేను మారాను, నన్ను నమ్మండి అంటూ మొదలుపెట్టాడు. అసలు మనిషి అన్నివాడు ఎన్నిసార్లు మారతాడు? ఇన్ని గెటప్పులు వేయడం చంద్రబాబుకు, ఆయన మావగారికే సాధ్యమైంది" అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.