క్రికెటర్ బుమ్రాతో పెళ్లిపై హీరోయిన్ అనుపమ తల్లి స్పందన! 

06-03-2021 Sat 15:55
  • బుమ్రా, అనుపమ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు
  • పెళ్లి కోసం నాలుగో టెస్టుకు బుమ్రా దూరమయ్యాడని ప్రచారం
  • ఈ వార్తల్లో నిజం లేదన్న అనుపమ తల్లి
Anupama Parameswaran mother responds on her marriage with Cricketer Bumrah

టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, సినీ నటి అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని.. అందుకే ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు నుంచి బుమ్రా తప్పుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. తాను ద్వారక వెళ్తున్నానంటూ అనుపమ పెట్టిన పోస్టు కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది.

ఈ నేపథ్యంలో, అనుపమ తల్లి స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఒక సినిమా షూటింగ్ కోసమే తన కూతురు గుజరాత్ కు వెళ్లిందని తెలిపారు. మరోవైపు అనుపమ గురించి మరోవార్త ప్రచారంలోకి వచ్చింది. ఆమె ప్రేమలో పడింది బుమ్రాతో కాదని... గణేశన్ అనే స్పోర్ట్స్ ప్రజెంటర్ తో అని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏది నిజం అనేది తెలియాలంటే బుమ్రా కానీ, అనుపమ కానీ అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది.