ఇక్కడ ఒక నాయకుడు కష్టకాలంలో మోసం చేశాడు: విశాఖ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు

06-03-2021 Sat 15:14
  • దక్షిణ నియోజకవర్గంలో ప్రచారం
  • ఓ వ్యక్తికి రెండు సార్లు టికెట్ ఇచ్చామన్న చంద్రబాబు
  • ఓ నాయకుడిగా తయారుచేశామని వివరణ
  • పార్టీ కష్టంలో ఉన్నప్పుడు అతడు ఏంచేశాడంటూ ఆగ్రహం
Chandrababu municipal election campaign in Visakha south

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నేడు విశాఖలో పర్యటిస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ ఒక నాయకుడు కష్టకాలంలో మోసం చేశాడని ఆరోపించారు. తాము ఆ నాయకుడికి 2014, 2019లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చామని, కానీ ఆ నాయకుడు పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఏంచేశాడో అందరికీ తెలుసని అన్నారు. అలాంటి అవకాశవాదులను ఉపేక్షించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

విశాఖ మంచివాళ్లు ఉండే నగరం అని, కానీ ఈ నగరాన్ని నేరస్తుల నగరంగా మార్చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున వాసుపల్లి గణేశ్ ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. తదనంతర కాలంలో వాసుపల్లి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.