చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును చదువడం తప్ప బాలయ్య ఏమీ చేయలేరు: మంత్రి కొడాలి నాని

06-03-2021 Sat 15:07
  • షూటింగుల కోసం బాలయ్య విదేశాల్లో తిరుగుతుంటారు
  • రాష్ట్ర పరిస్థితులపై ఆయనకు అవగాహన లేదు
  • ఆటలో అరటిపండులాంటి వ్యక్తి బాలయ్య 
Kodali Nani criticises Balakrishna

ఏపీ మంత్రి కొడాలి నాని ఏది మాట్లాడినా సంచలనమే. అవతలి వ్యక్తిపై ఆయన చేసే విమర్శలు, సెటైర్లపై రాష్ట్రంలో కనీసం రెండు రోజులైనా చర్చ జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై ఆయన విమర్శలు గుప్పించారు. బాలయ్య షూటింగుల నిమిత్తం ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో తిరుగుతుంటారని... అందువల్ల రాష్ట్ర పరిస్థితులపై ఆయనకు పూర్తిగా అవగాహన ఉండదని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదవడం తప్ప ఆయన ఏమీ చేయలేరని అన్నారు. ఆటలో అరటిపండులాంటి వ్యక్తి బాలయ్య అని ఎద్దేవా చేశారు

పంచాయతీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి మంత్రాంగానికి చంద్రబాబు మెదడు చితికిపోయిందని కొడాలి నాని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధాని మోదీని ప్రశ్నించలేక, ముఖ్యమంత్రి జగన్ ను చంద్రబాబు విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు శనిగ్రహం అని దివంగత ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని అన్నారు.