అహ్మదాబాద్ టెస్టు: ఇంగ్లండ్ పై పోటాపోటీగా వికెట్లు తీస్తున్న భారత స్పిన్నర్లు

06-03-2021 Sat 14:45
  • ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 96 రన్స్
  • అశ్విన్, అక్షర్ లకు చెరో 3 వికెట్లు
  • ఇంకా 64 పరుగులు వెనుకబడి ఉన్న ఇంగ్లండ్
  • క్రీజులో డాన్ లారెన్స్, బెన్ ఫోక్స్
Team India spinners crumbles England in Ahmbedabad test

అహ్మదాబాద్ లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఇవాళే ఫలితం తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. 160 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ను భారత స్పిన్నర్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

 ప్రస్తుతం ఆ జట్టు 96 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అశ్విన్, అక్షర్ పటేల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ (30) పోరాడినా అది కాసేపే అయింది. రూట్ ను అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అంతకుముందు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను అక్షర్ అవుట్ చేశాడు.

ప్రస్తుతం క్రీజులో డాన్ లారెన్స్ 22 పరుగులతోనూ, వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ 8 పరుగులతోనూ ఆడుతున్నారు. ఇంగ్లండ్ ఇంకా 64 పరుగులు వెనుకబడే ఉంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 205 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ 365 పరుగులు చేసింది.