శర్వానంద్ కొత్త చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'... టైటిల్ పోస్టర్ రిలీజ్

06-03-2021 Sat 14:28
  • నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న శర్వానంద్
  • కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు
  • తిరుమల కిశోర్ దర్శకత్వంలో చిత్రం
  • హీరోయిన్ గా రష్మిక మందన్న
Sarwanand new movie title poster released

ఇవాళ యువ హీరో శర్వానంద్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా శర్వా కొత్త చిత్రం టైటిల్ పోస్టర్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సినిమాకు 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు తిరుమల కిశోర్ దర్శకుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కనుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయిక. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

కాగా, 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రాన్ని దర్శకుడు తిరుమల కిశోర్ గతంలో విక్టరీ వెంకటేశ్ తో తీయాలని భావించినా అది ఫైనలైజ్ కాలేదు. ఇప్పుడా కథకే కొద్దిపాటి మార్పులు చేసి శర్వానంద్ తో తెరకెక్కిస్తున్నారు. తిరుమల కిశోర్ గతంలో రామ్ హీరోగా 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రంతో మంచి మార్కులే కొట్టేశాడు.