నా మనిషిని పంపించినా కేశినేని కాళ్లు విరగ్గొడతాడు: బుద్ధా వెంకన్న

06-03-2021 Sat 13:50
  • కేశినేని కుల రాజకీయాలు చేస్తున్నారు
  • విజయసాయిరెడ్డిని లంచ్ కి ఆహ్వానిస్తారా?
  • 2024లో విజయవాడ ఎంపీగా పోటీ చేస్తా
Budda Venkanna sensational comments on Kesineni Nani

  విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానిపై ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. నాని ఆయన కులాన్ని పట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని... ఆ వైఖరి పార్టీకి తీరని నష్టం చేస్తుందని అన్నారు. తామంతా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో పోరాటం చేస్తుంటే... ఆ వ్యక్తినే కేశినేని లంచ్ కు ఆహ్వానిస్తాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాబోయే రోజుల్లో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి తానేనని... 2024లో ఎంపీగా పోటీ చేస్తానని అన్నారు. కేశినేని నానికి అంత సీన్ లేదని... తన వెనుకున్న మనిషిని పంపినా ఆ వ్యక్తి కాళ్లు విరగ్గొడతాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను తలుచుకుంటే కేశినేని పని అయిపోతుందని చెప్పారు. విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని నాని కుమార్తె శ్వేతను ప్రకటించడంతో... టీడీపీలో ముసలం రాజుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేశినేని వ్యతిరేక నేతలంతా ఏకమయ్యారు.