ప్రెస్ నోట్: సరికొత్త నయనతార... స్టార్ మా లో!

06-03-2021 Sat 12:34
Goddess Nayanatara appears on Star Maa this Sunday

ప్రెస్ నోట్: ఆశ్చర్యం అనిపించేలా, అద్భుతం అని అభిప్రాయపడేలా వుండబోతోంది స్టార్ మా ఈ ఆదివారం (7 వ తేదీ) అందించబోయే ఎంటర్ టైన్మెంట్. సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రతిష్టాత్మక చిత్రం "అమ్మోరు తల్లి" ‘స్టార్ మా’ లో ప్రసారం కానుంది. సరికొత్తగా నయనతార స్టార్ మా ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేయబోతోంది. ఇప్పటి వరకు నయనతార చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు.. ఈ చిత్రం ఒకటీ ఒక ఎత్తు. ముక్కుపుడక అమ్మవారిగా నయనతార నటన ఈ చిత్రానికి ప్రత్యేకం. ఇక ప్రతి వారం లాగే ఈ మధ్యాహ్నం కూడా  పూర్తి స్థాయి వినోదం ప్రేక్షకుల కోసం ఎదురు చూస్తోంది.
 
మధ్యాహ్నం 12 గంటలకు సరిగమాలతో చేసే సరదా సరదా ప్రయాణం "స్టార్ట్ మ్యూజిక్ " షో తో సుమ చేస్తున్న హంగామా ఆదివారానికే ఓ ప్రత్యేకం. 1.30 గంటలకు "కామెడీ స్టార్స్" చేసే పంచులు కోలాహలం అద్భుతం. మధ్యాహ్నం అంతా మజా మజా గా సాగే వినోదం..  సో.. మొత్తం మీద 7 వ తేదీ స్టార్ మా ప్రేక్షకులు ఆస్వాదించేందుకు బోలెడంత వినోదం సిద్ధంగా వుంది.
 
"కామెడీ స్టార్స్" ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/K-VOev1jFzs
 
Press release by: Indian Clicks, LLC