శ‌ర్వానంద్‌కు స‌ర్‌ప్రైజ్.. కేక్ క‌ట్ చేయించిన రామ్ చ‌ర‌ణ్

06-03-2021 Sat 11:17
  • ఈ రోజు శ‌ర్వానంద్ పుట్టిన‌రోజు
  • చెర్రీకి శ‌ర్వానంద్ కృత‌జ్ఞ‌త‌లు
  • 'మ‌హా స‌ముద్రం' నుంచి ఫ‌స్ట్‌లుక్‌ విడుద‌ల
ram charan gives surprize to sharvanand

టాలీవుడ్‌ హీరో శ‌ర్వానంద్  ఈ రోజు పుట్టిన‌రోజు వేడుక జ‌రుపుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన హీరో రామ్ చ‌ర‌ణ్ ఆయ‌న‌తో కేక్ క‌ట్ చేయించి, స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను శ‌ర్వానంద్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. గ్రేట్ పార్టీ ఇచ్చినందుకు రామ్ చ‌ర‌ణ్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్న‌ట్లు పేర్కొన్నాడు.

కాగా, శ‌ర్వానంద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా.. ఆయ‌న న‌టిస్తోన్న కొత్త సినిమా మ‌హా స‌ముద్రం నుంచి ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. అజయ్ భూపతి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా  షూటింగ్ విశాఖ‌లో జ‌రుగుతోంది. ఫ‌స్ట్ లుక్‌లో చేతిలో ఆయుధంతో శర్వానంద్ పవర్‌ఫుల్ గెటప్‌తో క‌న‌ప‌డుతున్నాడు.