త‌న‌పై వ‌స్తోన్న ట్రోల్స్‌పై సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ స్పంద‌న‌!

06-03-2021 Sat 10:13
  • ఇటువంటి వాటి గురించి పట్టించుకోను
  • నా‌ సమయాన్ని వృథా చేసుకోను
  • ట్రోల్స్‌పై నెటిజ‌న్లే వారి సమయాన్ని వృథా చేసుకుంటున్నారు
thaman on trolling against him

తన సంగీతంపై సామాజిక మాధ్య‌మాల్లో జరుగుతోన్న ట్రోలింగ్ పై సంగీత ద‌ర్శ‌కుడు త‌మన్ స్పందించాడు. ఇటువంటి వాటి గురించి పట్టించుకుని త‌న‌ సమయాన్ని వృథా చేసుకోనని చెప్పుకొచ్చాడు. త‌న‌ సంగీతంపై ట్రోల్స్ సృష్టించ‌డం కోసం నెటిజ‌న్లే వారి సమయాన్ని వృథా చేసుకుంటున్నారని  అన్నాడు. సోషల్ మీడియా ద్వారా తాజాగా ఆయ‌న ఫ్యాన్స్‌తో ముచ్చ‌టించి, వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సమాధానా‌లు చెబుతూ ఈ వ్యాఖ్య‌లు చేశాడు.

మ‌హేశ్ బాబు న‌టిస్తోన్న స‌ర్కారు వారి పాట సినిమాకు త‌మన్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో ఆ సినిమా అప్‌డేట్ గురించి ఓ అభిమాని ప్ర‌శ్నించ‌గా, ఆ సినిమా నుంచి తప్పకుండా చాలా సర్‌ప్రైజ్‌లు వస్తాయని త‌మ‌న్ చెప్పాడు. స‌ర్కారు వారి పాట సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉందని, సర్‌ప్రైజ్‌ల కోసం ఎదురు చూడాల్సిందేన‌ని చెప్పాడు. ఆగస్టులో తప్పకుండా కలుసుకుందామ‌ని తెలిపాడు.