సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

06-03-2021 Sat 07:17
  • భర్త సినిమాలో సమంత స్పెషల్ రోల్ 
  • శివరాత్రికి 'ఆచార్య' నుంచి బిగ్ అప్ డేట్
  • తెలుగు 'డ్రీమ్ గాళ్'కి దర్శకుడి ఖరారు    
Samantha plays special role in her husbands film

*  'మనం' ఫేమ్ విక్రంకుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న 'థ్యాంక్యూ' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా రాజమండ్రిలో జరుగుతోంది. ఇందులో చైతు సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇది కాకుండా, ఈ సినిమాలో ఒక స్పెషల్ పాత్ర ఉందనీ, అందులో సమంత నటిస్తుందని తెలుస్తోంది.
*  మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రం నుంచి శివరాత్రి (మార్చ్ 11)కి ఓ బిగ్ అప్ డేట్ రానుంది. చిత్రం నుంచి ఆ రోజున ఒక సింగిల్ ను రిలీజ్ చేస్తారని సమాచారం. చిరంజీవి, కాజల్ ఒక జంటగా.. రామ్ చరణ్, పూజ హెగ్డే మరో జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న రిలీజ్ చేస్తారు.
*  హిందీలో ఆయుష్మాన్ ఖురానా నటించిన 'డ్రీమ్ గాళ్' చిత్రాన్ని రాజ్ తరుణ్ హీరోగా ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.