Jharkhand: ఝార్ఖండ్‌లో దారుణ ఘటన.. యువతిపై నెల రోజులుగా 60 మంది అత్యాచారం!

60 men gang raped woman in jharkhand
  • ఓ గ్యారేజీలో యువతిని బంధించిన నిందితులు
  • చాకచక్యంగా తప్పించుకున్న బాధితురాలు
  • ఆమె అనారోగ్యంతో బాధపడుతోందన్న పోలీసులు

ఝార్ఖండ్‌లో దారుణం జరిగింది. ఓ యువతిని బంధించిన దుండగులు నెలరోజులపాటు ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. బహిర్భూమి కోసం వెళ్తున్నట్టు చెప్పిన ఆమె వారి నుంచి  చాకచక్యంగా తప్పించుకుని బయటపడడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. వారి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది.

సరాయ్‌కేలా-ఖర్‌సావా జిల్లాలోని కందర్‌బేరా సమీపంలో మూతపడిన గ్యారేజీలో తనను నెల రోజులపాటు బంధించారని, 60 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత యువతి తెలిపింది. ఆమె అనారోగ్యంతో బాధపడుతోందని, అంతకుమించిన వివరాలు చెప్పలేకపోతోందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News