Vijayalakshmi: కేంద్రం ఇచ్చిన ర్యాంకును హైదరాబాద్ ప్రజలు అంగీకరించరు: నగర మేయర్ విజయలక్ష్మి

  • నివాసయోగ్య నగరాల జాబితా విడుదల 
  • హైదరాబాదుకు 24వ స్థానం
  • అసంతృప్తి వ్యక్తం చేసిన నగర మేయర్
  • నగర ప్రతిష్ఠను దెబ్బతీసేలా ర్యాంకింగ్ ఉందని వ్యాఖ్య 
  • ఉత్తమ నగరానికి ఉండాల్సిన ప్రమాణాలు ఉన్నాయని వివరణ
 Mayor Vijayalakshmi disappoints with Union Government ranking for Hyderabad

కేంద్రం విడుదల చేసిన నివాసయోగ్య నగరాల జాబితాలో హైదరాబాదుకు 24వ స్థానం దక్కడంపై నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు. కేంద్రం ఇచ్చిన ఈ ర్యాంకును హైదరాబాద్ నగర ప్రజలు అంగీకరించరని అన్నారు.

నగరానికి 24వ ర్యాంకు ఇవ్వడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. ఉత్తమ నగరానికి ఉండాల్సిన అన్ని ప్రమాణాలు హైదరాబాదుకు ఉన్నాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ర్యాంకింగ్ హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా ఉందని విజయలక్ష్మి విమర్శించారు.

కేంద్రం నిన్న విడుదల చేసిన నివాసయోగ్య నగరాల జాబితాలో హైదరాబాదుకు 55.4 స్కోరుతో 24వ ర్యాంకు లభించింది. మున్సిపల్ పనితీరులో 49.08 స్కోరుతో 17వ ర్యాంకు దక్కింది.

More Telugu News