విశాఖ టీడీపీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ప్రకటించిన చంద్రబాబు
- జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ప్రచారం
- నగరంలో రోడ్ షో నిర్వహిస్తున్న టీడీపీ అధినేత
- టీడీపీకి ఘన విజయం కట్టబెట్టాలని ఓటర్లను కోరిన బాబు
పీలా శ్రీనివాస్ మేయర్ కావడం ఖాయమని... ఆయన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిదేళ్ల పాటు తాను సీఎంగా ఉన్నప్పుడు విశాఖను ఆర్థిక రాజధానిగా చేసేందుకు ఎంతో కృషి చేశానని చెప్పారు. హుదూద్ తుపాను సమయంలో 10 రోజులు విశాఖలోనే ఉన్నానని... నగరం మళ్లీ సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే తిరిగి వెళ్లానని తెలిపారు. విశాఖ ప్రజలు టీఢీపీకి ఘన విజయాన్ని కట్టబెట్టాలని కోరారు.