అభిజిత్ తో భారీ డీల్ కుదుర్చుకున్న అన్నపూర్ణ స్టూడియోస్

05-03-2021 Fri 19:07
  • అభిజిత్ తో 3 సినిమాలకు అగ్రిమెంట్ చేసుకున్న అన్నపూర్ణ స్టూడియోస్
  • అమలతో కలిసి 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో నటించిన అభిజిత్
  • కెరీర్ పరంగా బిజీగా మారిన బిగ్ బాస్ కంటెస్టెంట్లు
Annapurna studios makes agreement with Abhijeet

బిగ్ బాస్ సీజన్-4 విజేత అభిజిత్ జాక్ పాట్ కొట్టాడు. ప్రముఖ సినీ నటుడు నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ అభిజిత్ తో ఏకంగా 3  సినిమాలకు డీల్ కుదుర్చుకుంది. మూడు చిత్రాలకు అభిజిత్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. అక్కినేని అమలతో కలిసి 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అనే చిత్రంలో అభిజిత్ నటించాడు. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అభిజిత్ ఇంతవరకు మౌనంగానే ఉన్నాడు. అతనితో పాటు పార్టిసిసేట్ చేసిన సొహైల్, అఖిల్, అరియానా, ముక్కు అవినాశ్, మెహబూబ్ తదితరులు ఇప్పటికే కెరీర్ పరంగా బిజీ అయ్యారు. అఖిల్, సొహైల్ లు సినిమాలలో నటిస్తున్నారు. మిగిలిన వారు వివిధ షోలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ తో మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా అభిజిత్ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు.