శ్రీకాళహస్తి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వానం

05-03-2021 Fri 19:06
  • శివరాత్రికి ముస్తాబవుతున్న ఏపీ శైవక్షేత్రాలు
  • శ్రీకాళహస్తిలో ఈ నెల 6 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు
  • క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన ఆలయవర్గాలు
  • ఆహ్వాన పత్రిక, పట్టువస్త్రాలు అందజేత
Srikalahasti temple authorities invites CM Jagan to Brahmotsavams

మహా శివరాత్రి సందర్భంగా ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో మార్చి 6 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు రావాలంటూ శ్రీకాళహస్తి ఆలయ వర్గాలు సీఎం జగన్ ను ఆహ్వానించాయి. కాళహస్తీశ్వరాలయ అర్చకులు, ఈవో పెద్దిరాజు, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆయనకు పవిత్ర పట్టువస్త్రాలు బహూకరించారు.