Andhra Pradesh: ఆదాయపు పన్ను పేరుతో.. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో కోత విధించిన ఏపీ ప్రభుత్వం

  • ఈ నెల పెన్షన్ లో కోత
  • సేవింగ్స్ క్లెయిమ్స్ ఇవ్వకపోవడం వల్లే కోత అంటున్న అధికారులు
  • క్లెయిమ్స్ పంపినా తమకు చేరలేదంటున్నారని రిటైర్డ్ ఉద్యోగుల ఆగ్రహం
AP govt cuts pension of retired employees

రిటైర్డ్ ఉద్యోగులకు కొందరికి ఈ నెల పెన్షన్ లో ఏపీ ప్రభుత్వం కోత విధించింది. ఆదాయపు పన్ను పేరుతో పెన్షన్ ను కట్ చేశారు. ఈ నేపథ్యంలో రిటైర్డు ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ఆర్థికశాఖ అధికారులు మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఇలాంటి కోతను విధించడం సహజమేనని చెప్పారు. చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు వారి సేవింగ్స్ క్లెయిమ్స్ ఇవ్వకపోవడం వల్ల... వారికి కోత ఎక్కువగా ఉండొచ్చని తెలిపారు. వీరి వివరణపై రిటైర్డు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సేవింగ్స్ క్లెయిమ్స్ పంపినా... తమకు చేరలేదని అధికారులు అంటున్నారని మండిపడ్డారు. తమ ప్రశ్నలకు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని అన్నారు.

More Telugu News