ఏపీలో మరోసారి 100కి పైగా కరోనా కేసులు

05-03-2021 Fri 18:29
  • గత 24 గంటల్లో 51,660 కరోనా పరీక్షలు
  • 124 మందికి కరోనా పాజిటివ్
  • చిత్తూరు జిల్లాలో 30 కొత్త కేసులు
  • కోలుకున్న 94 మంది
  • ఇంకా 900 మందికి చికిత్స
  • అనంతపురం జిల్లాలో ఒకరి మృతి
Once again hundred plus corona cases identifies in AP

ఏపీలో మళ్లీ కరోనా వ్యాప్తి పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరోసారి 100కి పైగా కొత్త కేసులు గుర్తించారు. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 51,660 కరోనా పరీక్షలు నిర్వహించగా 124 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 30 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 18, గుంటూరు జిల్లాలో 16, తూర్పు గోదావరిలో 13, విశాఖ జిల్లాలో 13, అనంతపురం జిల్లాలో 10 కేసులు గుర్తించారు. ప్రకాశం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 94 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అనంతపురం జిల్లాలో ఒకరు మరణించగా, కరోనా మృతుల సంఖ్య 7,172కి చేరింది. ఏపీలో ఇప్పటివరకు 8,90,441 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,369 మంది కరోనా ప్రభావం నుంచి బయటపడ్డారు. ఇంకా 900 మందికి చికిత్స కొనసాగుతోంది.