'ఆచార్య'లో రామ్ చరణ్ పై సన్నివేశాల చిత్రీకరణ పూర్తి... ఘనంగా వీడ్కోలు పలికిన ఫ్యాన్స్

05-03-2021 Fri 17:37
  • చిరు, కొరటాల కాంబినేషన్లో ఆచార్య
  • ఏజెన్సీ ఏరియాలో షూటింగ్
  • చిరంజీవి, రామ్ చరణ్ లపై 20 రోజుల పాటు చిత్రీకరణ
  • రాజమండ్రి ఎయిర్ పోర్టులో కోలాహలం
Ram Charan completes his part in Acharya shooting

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతోంది. కాగా, రామ్ చరణ్ పై సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది.

తన తండ్రి చిరంజీవితో కలిసి 20 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్న రామ్ చరణ్ తిరిగి హైదరాబాద్ పయనం అయ్యాడు. రాజమండ్రి ఎయిర్ పోర్టులో చరణ్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఓవైపు అభిమానుల కోలాహలం, మరోవైపు మీడియా కుతూహలం... రామ్ చరణ్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఆచార్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.