Sensex: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

  • అమ్మకాల ఒత్తిడికి గురైన సూచీలు
  • 440 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 142 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
Stock markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా భారీగా నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ మినహా మిగిలిన అన్ని సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 440 పాయింట్లు కోల్పోయి 50,405కి పడిపోయింది. నిఫ్టీ 142 పాయింట్లు పతనమై 14,938కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (1.95%), మారుతి సుజుకి (1.60%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.24%), నెస్లే ఇండియా (0.59%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.47%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.79%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.03%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.86%), ఎన్టీపీసీ (-1.85%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.80%).

More Telugu News