Egypt: బంగారు నాలుక ఉన్న 2 వేల ఏళ్ల నాటి మమ్మీ గుర్తింపు!

  • ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో బయల్పడిన మమ్మీ
  • క్లియోపాత్రా కోసం కొనసాగుతున్న తవ్వకాలు
  • తవ్వకాల్లో బయటపడిన పలు సమాధులు
Egyptian mummies with golden tongues found in Alexandria

ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో 2 వేల ఏళ్ల నాటి మమ్మీ బయల్పడింది. అలెగ్జాండ్రియా ప్రాంతంలో పురావస్తుశాఖ అధికారులు చేపట్టిన తవ్వకాల్లో ఈ మమ్మీని గుర్తించారు. చాలా ఏళ్లుగా ఈ టీమ్ అక్కడ తవ్వకాలను చేపడుతోంది. చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఈజిప్టు రాణి క్లియోపాత్రా మృతదేహాన్ని కనుక్కోవడానికి వారు తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాల్లో పలు సమాధులు బయటపడ్డాయి.

ఈజిప్టును క్రీస్తుపూర్వం ఫారోలు పాలించారు. వీరిలో చివరగా క్లియోపాత్రా పాలించారు. ఈమె తర్వాత ఈజిప్టును రోమన్లు పరిపాలించారు. మరోవైపు అలెగ్జాండ్రియాలో తాజాగా దొరికిన మమ్మీ నోట్లో బంగారు నాలుకను ఉంచారు. తమ జీవితాన్ని పూర్తి చేసుకున్న తర్వాత కూడా మాట్లాడతారనే నమ్మకంతో ఈ మమ్మీకి బంగారు నాలుకను ఉంచినట్టు విశ్వసిస్తున్నారు.

More Telugu News