చిన్నారి పాట‌కు ఫిదా అయిపోయి వీడియో పోస్ట్ చేసిన‌ చంద్ర‌బాబు నాయుడు!

05-03-2021 Fri 13:27
  • తెలుగు భాష గొప్ప‌ద‌నాన్ని చెబుతూ పాట‌
  • త‌ర‌గ‌తి గ‌దిలో పాడిన‌ ఆరో త‌ర‌గ‌తి విద్యార్థిని
  • తెలుగును పాలకులు కనుమరుగు చేయాల‌నుకుంటున్నార‌న్న చంద్ర‌బాబు
chandrababu praises girl

తెలుగు భాష గొప్ప‌ద‌నాన్ని చెబుతూ త‌ర‌గ‌తి గ‌దిలో ఆరో త‌ర‌గ‌తి విద్యార్థిని పాడిన పాట‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఫిదా అయిపోయారు. అదే స‌మ‌యంలో వైసీపీ స‌ర్కారుపై ఆయ‌న మండిప‌డ్డారు. తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తూ.. ఎంతో శ్రావ్యంగా గానం చేసిన ఈ 6వ తరగతి చిన్నారిని మనసారా అభినందిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

ఈ పాట సాహిత్యాన్ని వింటుంటే ప్రజలకు తెలుగు భాష మీద ఉన్న మమకారం స్పష్టమవుతోందని చెప్పారు. అలాంటి తెలుగును పాలకులు కనుమరుగు చేయాలనుకోవడం ప్రజల అభీష్టానికి వ్యతిరేకం.. దారుణమ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. వీణియనాద వినోదంలా.. తేనియ మధురిమ సారంలా మానిత కోకిల గానంలా అంటూ ఆ విద్యార్థిని పాడిన పాట అల‌రిస్తోంది.