Andhra Pradesh: ఎమ్మెల్సీలుగా వైసీపీ అభ్యర్థులు ఆరుగురూ ఏకగ్రీవమే!

  • ముగిసిన మండలి సభ్యుల నామినేషన్ తేదీ
  • మరే పార్టీ నుంచి దాఖలు కాని నామినేషన్లు
  • మండలిలో18కి పెరిగిన వైసీపీ బలం
Six YSRCP MLCs Uninimous in Andhra Pradesh

గడచిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీని సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలిలోనూ క్రమంగా తన బలాన్ని పెంచుకుంటోంది. తాజాగా జరిగిన మండలి ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురులేకుండా పోయింది. మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించగా, కేవలం ఆరుగురి నుంచి మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. వారంతా వైసీపీకి చెందిన వారే. దీంతో వారందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు.

కాగా, వైసీపీ తరఫున మహమ్మద్‌ ఇక్బాల్‌, కరీమున్నీసా, బల్లి కల్యాణ్‌ చక్రవర్తి,  చల్లా భగీరథ రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్‌, సి.రామచంద్రయ్యలను ఎంపిక చేసిన సీఎం వైఎస్ జగన్, గురువారం నాడు వారికి బీ ఫారమ్ లను అందించిన సంగతి తెలిసిందే. ఈ ఆరుగురి ఎన్నికతో వైసీపీ బలం మండలిలో 18కి చేరుకుంది. ప్రస్తుతం శాసన మండలిలో టీడీపీ సభ్యుల సంఖ్య 26గా ఉండగా, ప్రోగ్రసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు ఐదుగురు, బీజేపీ మూడు, ఇండిపెండెంట్లు ముగ్గురు వున్నారు. మరో మూడు ఖాళీలకు ఎన్నికలు జరగాల్సి వుంది.

More Telugu News