Nimmagadda Ramesh Kumar: మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో డ‌బ్బు ప్ర‌వాహాన్ని అడ్డుకునేందుకు చ‌ర్య‌లు: ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌

  • ప్రత్యేకంగా దృష్టి సారించాం
  • ఐటీశాఖతోనూ మాట్లాడాం
  • ప్రత్యేక బృందాల‌ ఏర్పాటు
  • చెక్‌పోస్టుల్లో తనిఖీలు  
will restrict money distribution nimmagadda

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మునిసిపల్‌ ఎన్నికల నేప‌థ్యంలో ధన ప్రభావంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ స్పందించారు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, మునిసిప‌ల్ ఎన్నికల్లో నగదు అక్రమాలపై ఐటీశాఖతోనూ మాట్లాడామని ఆయన చెప్పారు.

డబ్బుతో పాటు మద్యం పంపిణీని క‌ట్ట‌డి చేయ‌డానికి ప్రత్యేక బృందాల‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయ‌న తెలిపారు. డబ్బు ప్రభావాన్ని త‌ప్ప‌కుండా నియంత్రిస్తామని, ప్రలోభాలపై దృష్టి సారించామ‌ని అన్నారు. ఇందుకు గానూ రవాణాపై మరింత నిఘా ఉంచుతున్నామని తెలిపారు.

మునిసిప‌ల్ ఎన్నిక‌లు జ‌రుగుతోన్న ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల్లో తనిఖీలు జరుపుతున్నామని తెలిపారు. ఐటీతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు కూడా ఆయా అంశాల‌ను పరిశీలిస్తాయని, ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఇప్పటికే సమస్యాత్మక  ప్రాంతాలను గుర్తించామ‌ని వివరించారు.

More Telugu News